భరోసా మాది భవిష్యత్తు మీది..
- యాడ్ అప్లికేషన్ తప్పకుండా ప్రచురించగలరు
- ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఉద్భవించిందే
- పిఆర్టియు యూనియన్..
- పి ఆర్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట శేఖర్ రావు
సుజాతనగర్, అక్టోబర్ 19( విజయ క్రాంతి): ఉపాధ్యాయులు(Teachers) ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వారి హక్కుల సాధన(Achieving Rights) కోసం అనునిత్యం పోరాడే యూనియన్ పిఆర్టియు(Union PRTU) అని పి ఆర్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట శేఖర్ రావు అన్నారు.
గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని పి ఆర్ టి యు యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పెండింగ్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి సమస్యకు పరిష్కారం మార్గంగా స్పందిస్తూ అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను ఉపాధ్యాయుల దరి చేర్చి వారి భవిష్యత్తుకు భరోసానిచ్చే యూనియన్ పిఆర్టియు అని అన్నారు.
ఉపాధ్యాయులకు అత్యంత కీలకంగా ఉన్న సంక్షేమ నిధి ఉపాధ్యాయుల కుటుంబాలకు అందజేస్తూ వారి భవిష్యత్తుకు భరోసానిస్తూ లక్షలాది రూపాయలను అందిస్తూ ఉపాధ్యాయులకు అండ దండగా నిలిచిన పిఆర్టియు యూనియన్ను ప్రతి ఒక్కరు సంఘ సభ్యులుగా చేరి బలోపేతం చేయాలని అన్నారు.
ఉపాధ్యాయుల సమస్యకు పరిష్కార మార్గమే చూపెట్టడం కాకుండా ఉపాధ్యాయుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందటానికి నిదర్శనంగా ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం పొందిన ఉపాధ్యాయులు సుందర్ వీరభద్రం కుటుంబాలకు ఒక్కో లక్ష చొప్పున రెండు లక్షల రూపాయల చెక్కులను అందజేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు రాష్ట్ర మాజీ అధ్యక్షులు ప్రస్తుత ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుంకరి బిక్షం గౌడ్ జిల్లా అధ్యక్షులు పూనం నరసయ్య ప్రధాన కార్యదర్శి బి భాస్కరరావు గౌరవ అధ్యక్షులు ప్రభాకర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పూనం శ్రీనివాస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఆర్ రంగారావు గౌరవ అధ్యక్షులు అసోసియేటెడ్ జిల్లా అధ్యక్షులు దశంబాబు రత్నకుమారి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.