ఓపెనింగ్‌లో జోష్.. క్లోజింగ్‌లో దూకుడు

19-11-2026 | 03:59pm

దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) భారీ లాభాలతో కళకళలాడాయి. మదుపరుల కొనుగోళ్ల జోరుతో సూచీలు పరుగులు పెట్టాయి. ట్రేడింగ్ (Trading) ముగిసే సమయానికి సెన్సెక్స్ (Sensex) ఏకంగా 990 పాయింట్లు లాభపడి 83,022 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ (Nifty) 286 పాయింట్లు పెరిగి 25,514 వద్ద స్థిరపడింది.

ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ షేర్లలో భారీ కొనుగోళ్లు వెల్లువెత్తడంతో బ్యాంక్ నిఫ్టీ అదరగొట్టింది. ఏకంగా 1,024 పాయింట్లు ఎగబాకి మార్కెట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో ఇన్వెస్టర్లలో (Investors) ఉత్సాహం నెలకొంది. ఉదయం నుంచి కనిపించిన కొనుగోళ్ల జోరు చివరి వరకు కొనసాగడంతో ప్రధాన సూచీలన్నీ భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. సెన్సెక్స్, నిఫ్టీతో పాటు బ్యాంక్ నిఫ్టీ కూడా దూసుకెళ్లడంతో దేశీయ మార్కెట్లలో లాభాల సందడి నెలకొంది.

మరిన్ని వార్తలు