8వ వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శ్రీకారం

20-11-2026 | 11:21pm

మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యం 

మున్సిపల్ చైర్మన్ మోహన్ నాయక్

కల్లూరు, నవంబర్ 20 (విజయక్రాంతి): కల్లూరు మున్సిపాలిటీ(Kallur Municipality) పరిధిలోని 8వ వార్డులో నగర అభివృద్ధి నిధుల కింద నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు(CC road and drainage construction) శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్(Municipal Chairman Dharavath Mohan Naik), 8వ వార్డు కౌన్సిలర్ డాక్టర్ లక్కినేని రఘు, కమిషనర్ జి. సాయి కృష్ణారెడ్డి కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. 8వ వార్డు ప్రజల చిరకాల సమస్యలకు పరిష్కారంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ శీలం కోటేశ్వరి కృష్ణారెడ్డి, కౌన్సిలర్ యాసా నాగమణి శ్రీకాంత్, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు