జగిత్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం

12-11-2026 | 09:27pm

మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్

జగిత్యాల, నవంబర్ 22 ( విజయ క్రాంతి ): జగిత్యాల పట్టణంలోని 39 వార్డు బ్రాహ్మణ వీధిలో వార్డ్ కౌన్సిలర్ బొలసాని శ్రీనివాస్ తో కలిసి వార్డు ను మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్(Municipal Commissioner Satya Pranav) సందర్శించినారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని 39 వ వార్డులో మెడికల్ షాప్ వారు బహిరంగ ప్రదేశంలో చెత్త వేయడం గమనించి షాపు యజమానికి మున్సిపల్ కమిషనర్ జరిమానా విధించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగంగా ఎవరు కూడా రోడ్లపై చెత్త వేయరాదని మున్సిపల్ ఆటో వచ్చినప్పుడు ఆటోలో మాత్రమే వేయాలని, దీనికి పట్టణ ప్రజలు అందరూ సహకరించి రోడ్లపై చెత్త వేయరాదని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, వార్డ్ ఆఫీసర్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు