అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే ఫోకస్
జగిత్యాల, నవంబర్ 10 (విజయక్రాంతి): జగిత్యాల–నిజామాబాద్ జాతీయ రహదారిపై గాంధీనగర్ వద్ద జరుగుతున్న వంతెన నిర్మాణ పనులను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పరిశీలించారు. జగిత్యాల నియోజకవర్గంలోని రాయికల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్తున్న సందర్భంగా ఆయన పనుల పురోగతిని సమీక్షించారు. వంతెన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా జగిత్యాల పట్టణానికి తాగునీటిని సరఫరా చేసే పైప్లైన్ దెబ్బతిన్న నేపథ్యంలో ప్రజలకు నీటి సరఫరాలో ఇబ్బందులు కలగకుండా తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. పనులను త్వరగా పూర్తి చేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని అధికారులకు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సమీండ్ల శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ స్వప్న గిరిధర్, సేవాదళ్ కార్యదర్శి ముకేష్ ఖన్నా తదితరులు పాల్గొన్నారు