విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి
ఆసిఫాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో(Government School) విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాలని జిల్లా కలెక్టర్ కె . హరిత(District Collector K. Haritha) ఉపాధ్యాయులను ఆదేశించారు. మంగళవారం రెబ్బెన మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను(Mandal Parishad Primary School) కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు.పాఠ్యాంశాలతో పాటు మౌలికంగా విద్యాబోధన చేయాలని, ఇంగ్లీష్, గణితం, సైన్స్ సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని, వంటగది, మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని ఆదేశించారు.