అంబరాన్నంటిన గుస్సాడీల సంబరాలు

10-11-2026 | 02:42pm

ఎంపీ జీ నగేష్ ఆధ్వర్యంలో 11 ఏళ్లుగా ఉత్సవాలు. 

బోథ్. నవంబర్ 10 ( విజయక్రాంతి): బజార్‌హత్నూర్ మండలంలోని(Bazarhatnur Mandal) జాతర్ల గ్రామంలో దండారి గుస్సాడీ వేడుకలు(Dandari-Gussadi Celebrations) ముగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా కొనసాగాయి. కార్యక్రమం ఆదిలాబాద్ ఎంపీ గూడెం నగేష్(Adilabad MP Gudem Nagesh) ఆధ్వర్యంలో నిర్వహించారు. ముగింపు వేడుకల్లో నలభై గ్రాముల దండారి గుస్సాడి బృందాలు పాల్గొన్నారు. 11 సంవత్సరాల కాలంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భారీ సంఖ్యలో గుస్సాడి బృందాలు నృత్యాలు చేసి ఆలరించారు. మొదట ఆదివాసుల ఆరాధ్య దైవమైన ఎత్మామాసూర్, గుస్సాడీ దేవతలకు ప్రత్యేక పూజలు గ్రామ పటేల్ దేవారిలతో కలిసి ఎంపీ చేపట్టారు.

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పుట్లూరు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి మకరంద ఆదివాసీల సాంప్రదాయ నిధులు ధోతిని కట్టుకొని పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన గోండి భాషలో మాట్లాడుతూ ఆదివాసీల గొప్ప సంస్కృతిని కాపాడుకుంటూ భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తాటిపల్లి రాజు రైల్వే బోర్డు మాజీ సభ్యులు జి వి రమణ, దిశా డైరెక్టర్ పెందుర్ తులసి రామ్, ఏపీవో ఆత్రం భాస్కర్ తో పాటు ట్రైబల్ వెల్ఫేర్ డి టి డబ్ల్యూ ఓ గోడం చందన్ పరువు గ్రామాల ప్రజలు అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు