గ్రామపంచాయతీ రికార్డులు సక్రమంగా నిర్వహించాలి

10-11-2026 | 02:45pm

ఆసిఫాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): గ్రామపంచాయతీల్లో(Village Panchayat) రికార్డులను సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత(District Collector K. Haritha) అధికారులను ఆదేశించారు. మంగళవారం రెబ్బెన మండలంలోని గ్రామపంచాయతీ కార్యాలయాన్ని(Gram Panchayat Office) కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా హాజరు పట్టిక(Attendance Sheet), ఇతర రికార్డులను పరిశీలించారు. ఇంటి పన్నుల వసూళ్లను వంద శాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కార్యదర్శికి సూచించారు.

రికార్డులు, క్యాష్‌బుక్‌ల నిర్వహణ సక్రమంగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు