హాకా రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
జగిత్యాల, నవంబర్ 10 ( విజయక్రాంతి ) : జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్(Hasnabad, Jagtial Urban Mandal) సమీపంలోని ఏ ఆర్ గార్డెన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన హాకా రైతు సేవా కేంద్రాన్ని(Hakka Farmer Service Center) జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్(Sanjay Kumar) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు(Farmers') తక్కువ ధరలకు ఎరువులు, విత్తనాలు(Fertilizers, seeds), ఇతర వ్యవసాయ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో హాకా రైతు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్నారు. వానాకాలం వరి కోతలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో త్వరితగతిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ని కోరినట్లు తెలిపారు. రేపు పాక్స్ జగిత్యాల ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం చల్గల్ లో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో అత్యధిక మొక్కజొన్న పంట కొనుగోలు చేయటం జరిగింది.
తక్కువ సమయంలో పండే పంటలు పండించే విదంగా ఆలోచన చేయాలని సూచించారు. ప్రస్తుతం ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు ఆరుతడి పంటల సాగు వైపు మొగ్గు చూపాలని, సాగులో విద్యుత్, నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, ఏ ఎం సి చైర్మెన్ గడ్డం నారాయణ రెడ్డి, ఫ్యాక్స్ చైర్మెన్ కొలుగూరి దామోదర్ రావు, నక్కల రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాల ముకుందం, మాజీ జడ్పీటీసీ పెండెం రాములు, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు బొలిశెట్టి గంగారెడ్డి, ఏ ఎం సి వైస్ చైర్మన్ అబ్బూరి మల్లేశం గౌడ్, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.