పోలీస్ క్వార్టర్స్‌లో మహిళా హోంగార్డు హత్య
హత్యకు కారకుడు భర్తే!
నల్లగొండలో కలకలం!
నల్లగొండ, నవంబర్ 10 (విజయక్రాంతి): నల్లగొండ పట్టణంలో(Nalgonda town) దారుణ ఘటన జరిగింది. వివరాలలోకి వెళ్తే.. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రూరల్ పోలీస్ స్టేషన్(Rural Police Station) ఎదురుగా ఉన్న పోలీస్ క్వార్టర్స్‌లో మహిళా హోంగార్డు మెహబూబ్ బీ హత్యకు(Murder of female Home Guard Mehboob Bee) గురయ్యారు. హెడ్‌క్వార్టర్స్‌లో(police quarters) విధులు నిర్వహిస్తున్న మెహబూబ్ బీని ఆమె భర్త సతీష్ గొంతు నులిమి హత్య చేసినట్లుగా ప్రాథమిక సమాచారం. వీరిద్దరూ కులాంతర వివాహం చేసుకున్నట్లు తెలుస్తుండగా, కొంతకాలంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు వెంటనే పోలీస్ క్వార్టర్స్‌కు చేరుకుని విచారణ చేపట్టారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, కుటుంబ కలహాలే కారణమా అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికావాల్సి ఉంది.