సేవకు గుర్తింపు.. మాసం లక్ష్మీ సొసైటీకి అవార్డు

10-11-2026 | 01:57pm

బోథ్, నవంబర్ 10 (విజయక్రాంతి): మండల కేంద్రానికి చెందిన మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీకి సేవా రత్న అవార్డు లభించింది. రాయిగూడ గ్రామంలో సామ్రాట్ అశోక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మాసం అనిల్ కుమార్‌కు ఈ అవార్డును అందజేశారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, సామ్రాట్ అశోక్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముస్తాపురి అశోక్ అవార్డును ప్రదానం చేశారు. భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని వారు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెందుర్తి లక్ష్మణ్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు నీలాదేవి, ఐటీడీఏ ఏటీఓ ఆత్రం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు