మహిళ మెడలోంచి పుస్తేల తాడు చోరీ

03-11-2026 | 07:01pm

కొడిమ్యాల, నవంబర్ 3 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం గంగారం  తండాకు(Gangaram Thanda) చెందిన అజ్మీరా దూరి మంగళవారం ఉదయం స్థానిక ఐకేపీ సెంటర్ లో(IKP Center) ధాన్యాన్ని ఆరపోస్తుండగా ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై సెంటర్ కు చేరుకొని ఒంటరిగా ఉన్న మహిళ అజ్మీరా దూరి మెడలో ఉన్న సుమారు రెండున్నర తులాల బంగారు పుస్తేల తాడును బలవంతంగా లాక్కొని పారిపోయారు. కాగా చోరికి పాల్పడ్డ అనుమానితుల సీసీ కెమెరాలో వీడియో రికార్డు కావడంతో వీరికి పట్టుకోవడానికి ఎస్సై నరేష్,పోలీసులు  వెతుకుతున్నారు.ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు.

మరిన్ని వార్తలు