మాజీ వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్‌కు కేసీఆర్‌తో ఆత్మీయ భేటీ

27-11-2026 | 10:23pm

గండీడ్,నవంబర్ 27 విజయక్రాంతి : మండల అభివృద్ధి, వ్యక్తిగత విషయాలపై రెండు గంటల పాటు చర్చ ఎర్రవల్లిలో(Erravalli) తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్(BRS) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును(Kalvakuntla Chandrashekar Rao) గండీడ్ మండల మాజీ వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్(Eswaraiah Goud) ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు నవాబ్‌పేట మండలం నుంచి గతంలో పాదయాత్రలో పాల్గొన్న తిరుపతయ్య, మాజీ ఎంపీపీ శ్రీనివాస్,మండల యువజన విభాగం అధ్యక్షుడు మెండే శ్రీనివాస్‌తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్ సుమారు రెండు గంటల పాటు సమయం కేటాయించి తెలంగాణకు సంబంధించిన అంశాలతో పాటు వ్యక్తిగత విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేసీఆర్‌తో కలిసి తేనీటి విందులో పాల్గొన్నట్లు ఈశ్వరయ్య గౌడ్ తెలిపారు.

మరిన్ని వార్తలు