బాల్య వివాహాల నిర్మూలనకు ‘షేర్’ అవగాహన

27-11-2026 | 10:28pm

మహబూబాబాద్: బాల్య వివాహాల రహిత(Free from child marriages) భారతదేశ నిర్మాణమే లక్ష్యంగా మహబూబాబాద్ జిల్లాలో(Mahabubabad District) సొసైటీ ఫర్ హెల్త్ అవేర్‌నెస్ అండ్ రూరల్ ఎన్‌లైటెన్‌మెంట్ (షేర్(Share)) సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాల్య వివాహాల(International child marriages) నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా అవగాహన, ప్రతిజ్ఞ కార్యక్రమాలు చేపట్టారు. బాల్య వివాహాలను ధైర్యంగా అడ్డుకున్న బాలికలు(Girls) తమ అనుభవాలను పంచుకోగా, వారిని ఘనంగా సన్మానించారు. జిల్లా స్త్రీ సంక్షేమ అధికారి, చైల్డ్‌లైన్, సఖి వన్‌స్టాప్ సెంటర్ ప్రతినిధులు, సర్పంచులు, అంగన్‌వాడీ సిబ్బంది, మతపెద్దలు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శనలో సుమారు 250 మంది పాల్గొని బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు.

మరిన్ని వార్తలు