మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి

12-11-2026 | 10:54pm

ఆప్ జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ 

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) కేంద్రంలో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ అన్నారు. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ కార్యాలయంతో పాటు డీజీపీ కార్యాలయంలో అరవింద్ వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ భూపాలపల్లి పట్టణం నుండి దినదినాభివృద్ధి చెంది జిల్లాగా ఏర్పాటయిందన్నారు.

సింగరేణి, జెన్ కో ప్రాంతం కావడంతో అనేక పాఠశాలలు కళాశాలలు, వసతి గృహాలకు నిలయంగా మారిందని భవిష్యత్తులో మరిన్ని విద్యాసంస్థలు పెరిగే అవకాశం ఉందని అన్నారు. జిల్లా కేంద్రంలో విద్యార్థినిలు, మహిళ రక్షణ కోసం మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో పాటు బాలికల వసతి గృహాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని దాంతో వారు విద్యార్థినిలు, మహిళలు ధైర్యంగా ఉండే అవకాశం ఉంటుందని వెంటనే ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ వైపుగా కృషి చేయాలని అరవింద్ కోరారు.

మరిన్ని వార్తలు