అదనపు కలెక్టర్ ను సన్మానించిన సర్పంచ్ రాధిక, శ్రీనివాస్ దంపతులు

16-11-2026 | 02:35pm

గణపురం, నవంబర్ 16 (విజయక్రాంతి): గణపురం మండల కేంద్రంలోని చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లను భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి(Additional Collector Vijayalakshmi) సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టత, చారిత్రక ప్రాశస్త్యాన్ని పరిశీలించి స్వామివారిని దర్శించుకున్నారు. అదనపు కలెక్టర్ విజయలక్ష్మిని గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు.

ఆలయ చరిత్ర, శిల్పకళా సంపద, అభివృద్ధి, పరిరక్షణకు సంబంధించిన అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. కోటగుళ్ల చారిత్రక వైభవాన్ని కాపాడుతూ మరింత అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీడీవో ఎల్. భాస్కర్, పంచాయతీ కార్యదర్శి ఉమ్మల్ల విజేందర్,అధికారులు, కోటగుళ్ల పరిరక్షణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు