కార్మికుల సంక్షేమానికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే జీఎంఆర్
అగర్వాల్ రబ్బర్ పరిశ్రమ వద్ద బీఆర్టీయూ జెండా ఆవిష్కరణ
పటాన్ చెరు: అగర్వాల్ రబ్బర్ పరిశ్రమ(Agarwal Rubber Industry)లో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు, వారి సంక్షేమానికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్ చెరు ఎమ్మెల్యే జిఎంఆర్, ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు గూడెం మహిపాల్ రెడ్డి(Employees Union President Gudem Mahipal Reddy) తెలిపారు.
సోమవారం పరిశ్రమ గేట్ వద్ద నిర్వహించిన బీఆర్టీయూ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జెండాను ఆవిష్కరించారు. అనంతరం పరిశ్రమ ఎండీ అమిత్ అగర్వాల్‌తో కార్మికుల సమస్యలపై చర్చించారు. కార్మికులకు చట్టబద్ధమైన అన్ని సౌకర్యాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యాదగిరి యాదవ్‌తో పాటు పలువురు కార్మిక సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.