పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

16-11-2026 | 01:36pm

పదవి బాధ్యతలు చేపట్టిన వారు పార్టీ బలోపేతానికి కృషి చేయాలి : ఎంపీ నగేష్

ఆదిలాబాద్,(విజయక్రాంతి): పదవి బాధ్యతలు చేపట్టిన వారు పార్టీ అభివృద్ధికి, దళిత వర్గాల సంక్షేమానికి(Dalit welfare) అంకితభావంతో కృషి చేయాలని బీజేపీ ఎంపీ గొడం నగేష్(Adilabad MP Godam Nagesh) ఆకాంక్షించారు. బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులైన బోండ్ల నారాయణ సోమవారం ఎంపీ ని ఆదిలాబాద్ లో మర్యాదపూర్వకంగా కలువగా ఆయన్ని ఎంపీ ఘనంగా సన్మానించి, అభినందించారు.

ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించి ప్రోత్సహించిన ఎంపీ కి బోండ్ల నారాయణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజు,  ఘటిక క్రాంతి, కినక సురేష్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు