బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

16-11-2026 | 01:28pm

గాజులపల్లిలో అల్లం బుచ్చమ్మ, లో పాత్రికేయుడు  రామ్ కుమార్ మృతిపై ప్రగాఢ సంతాపం

మంథని,(విజయక్రాంతి): మంథని నియోజకవర్గం(Manthani Constituency)లో రెండు కుటుంబాల్లో చోటుచేసుకున్న విషాద ఘటనల నేపథ్యంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Dudilla Sridhar Babu) బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంథని మండలం గాజులపల్లి గ్రామంలో మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ(Former Press Academy Chairman Allam Narayana) తల్లి అల్లం బుచ్చమ్మ మరణించడంతో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

అదేవిధంగా మంథని పట్టణానికి చెందిన పాత్రికేయుడు పెండ్యాల రామ్ కుమార్ ఇటీవల మరణించడంతో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి ధైర్యం చెబుతూ, వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

మరిన్ని వార్తలు