‘బచ్ గయే’.. అమితాబ్ పోస్ట్‌తో కొత్త చర్చ!
ముంబై: బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌ను(Amitabh Bachchan) టార్గెట్‌గా చేసుకుని దాడికి కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్న ఇద్దరు షూటర్లను ఢిల్లీ పోలీసుల Special Cell అరెస్ట్ చేసింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వికాస్ ఠాకూర్ అలియాస్ విక్కీ, దీపక్ సింగ్ అలియాస్ దీప్‌ను శనివారం అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని అమితాబ్ నివాసం ‘జల్సా’ వద్ద కాల్పులకు వీరు ప్లాన్ చేసినట్లు పోలీసుల అనుమానం.
1984 సిక్కు వ్యతిరేక అల్లర్లపై అమితాబ్(Amitabh Bachchan Attack Plot) గతంలో చేసినట్లు చెబుతున్న ఓ వ్యాఖ్య ఈ కుట్రకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే దాడి వెనుక అసలు కారణం, నిందితులకు ఆదేశాలు ఇచ్చిన వ్యక్తులు ఎవరు అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, నవంబర్ 15–16 మధ్య రాత్రి అమితాబ్ సోషల్ మీడియాలో ‘బచ్ గయే’ (బతికిపోయాను) అంటూ పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది.
గత నెల రోజుల్లో అమితాబ్ నివాసం జల్సాతో పాటు ముంబైలోని ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటూ మూడు Bomb Threats రావడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. తాజా అరెస్టులతో దాడి కుట్ర భగ్నమైనట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి ఆయుధాల సరఫరా, గ్యాంగ్ నెట్వర్క్, ఇతర రాష్ట్రాల్లోని అనుచరుల వివరాలు రాబట్టేందుకు విచారణ చేపట్టారు. అక్రమ ఆయుధాల కలిగి ఉన్నందుకు Arms Act సెక్షన్ 25 కింద కేసు నమోదు చేశారు.