నిరుపేదలకు భరోసా... చేయూత పెన్షన్...!

16-11-2026 | 01:35pm

నియోజకవర్గంలో ప్రతి పేద కుటుంనానికి సంక్షేమ ఫలాలు అందించడమే నా సంకల్పం

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ,(విజయక్రాంతి): నిరుపేదల జీవితాల్లో భరోసా నింపుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే తన లక్ష్యమని, సంకల్పమని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ(Banswada) ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(MLA Pocharam Srinivas Reddy) అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత పింఛన్ల(Pensions) పంపిణీ కార్యక్రమనికి మాజీ ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో ఒక్క పేద కుటుంబం కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం కాకూడదనేదే తన సంకల్పమని పేర్కొన్నారు.ప్రభుత్వం అందిస్తున్న చేయూత పెన్షన్లు నిరుపేదలు, వృద్ధులు, వికలాంగులు, ఇతర అర్హులైన వారికి ఆర్థిక భరోసాగా నిలుస్తున్నాయని తెలిపారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తామని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు.

పేదల సంక్షేమం, సామాజిక భద్రత, ఆర్థిక చేయూతకు పెద్దపీట వేస్తూ అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రవీందర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ కాసుల విజయ, వైస్ చైర్ పర్సన్ రేష్మ బేగం ఎజాజ్,తాహసిల్దార్ రాజా నరేందర్ గౌడ్, ఎంపీడీవో ఆనంద్,మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు