టీజీవో జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(Telangana Gazetted Officers' Association) (టీజీవో) భూపాలపల్లి జిల్లా(Bhupalpally District) నూతన కార్యదర్శిగా అజర్ షరీఫ్, కోశాధికారిగా నగునూరి శ్రీనివాసరావు(Nagunuri Srinivasa Rao) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో టీజీవో జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘంలో ఖాళీగా ఉన్న కార్యదర్శి పోస్టు భర్తీతో పాటు నూతన కార్యవర్గ మార్పులను చేపట్టారు. ఇప్పటివరకు జిల్లా కోశాధికారిగా విధులు నిర్వహిస్తున్న అజర్ షరీఫ్‌ను కార్యదర్శిగా, వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న నగునూరి శ్రీనివాసరావును కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అధికారులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, సంఘం బలోపేతానికి అందరూ ఐక్యంగా కృషి చేయాలని జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో టీజీవో జిల్లా నాయకులు, ప్రతినిధులు, గెజిటెడ్ అధికారులు పాల్గొన్నారు.