నేషనల్ హెల్త్ మిషన్‌లో 33 పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల
అభ్యంతరాలు ఉంటే నవంబర్ 25 సాయంత్రం 5 గంటలలోపు తెలియజేయాలి
డీఎంహెచ్ఓ డాక్టర్ సీహెచ్ మధుసూదన్
భూపాలపల్లి టౌన్, నవంబర్ 21 ( విజయ క్రాంతి ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో(Jayashankar Bhupalpally District) వైద్య ఆరోగ్య శాఖ(Department of Medical and Health) ఆధ్వర్యంలో నేషనల్ హెల్త్ మిషన్(National Health Mission) కింద వివిధ క్యాడర్లలో 33 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు దరఖాస్తు(Application) చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజనల్ మెరిట్ జాబితాను(Provisional Merit List) విడుదల చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సీహెచ్ మధుసూదన్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సదరు ప్రొవిజనల్ మెరిట్ జాబితాను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, ఎఫ్ 25, సమీకృత జిల్లా అధికారుల కార్యాలయాల సముదాయంలోని నోటీస్ బోర్డులో, అదేవిధంగా జిల్లా అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ మెరిట్ జాబితాను పరిశీలించుకోవాలని, మెరిట్‌కు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈనెల 23వ తేదీ నుండి 25వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో తెలియజేయాలని సూచించారు. నిర్ణీత గడువు ముగిసిన అనంతరం ఎలాంటి అభ్యంతరాలను స్వీకరించబోమని స్పష్టం చేశారు.