పట్టభద్రుల ఓటర్ల వివరాల సేకరణ
07-11-2026 | 07:29pm
గణపురం,(విజయక్రాంతి): రానున్న వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల(Graduate MLC elections) నేపథ్యంలో చెల్పూర్ లోని వివిధ ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఓటు హక్కు నమోదు చేసుకున్న పట్టభద్రుల వివరాల(Graduate Details)ను బీజేపీ నాయకులు సేకరించారు. ఈ సందర్భంగా బీజేపీ గణపురం మండల కన్వీనర్ మంద మహేష్, బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుప్పటి భద్రయ్య పాల్గొని పట్టభద్రుల ఓటర్ల వివరాలను నమోదు చేసుకున్నారు. పట్టభద్రులంతా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.