పట్టణ భగీరథ పైప్ లైన్ లీకేజీ
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణ పరిధిలోని నేషనల్ హైవే 61, ఈద్గం, గోల్డెన్ ఫంక్షన్ హాల్ సమీపంలో మిషన్ భగీరథ తాగునీటి పైప్లైన్ లీకేజీ కారణంగా వేలాది లీటర్ల అమూల్యమైన నీరు రోడ్డుపై పారుతూ వృధాగా పోతుంది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధ్యక్షులు సయ్యద్ తీసుకొచ్చారు. తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
తీవ్రమైన కరువు, ఎండాకాలం సమీపిస్తున్న తరుణంలో ప్రజలు నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, అధికారులు మాత్రం నీటి వృధాను అరికట్టడంలో ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. రోజువారీగా వేలాది లీటర్ల నీరు రోడ్డుపాలవుతున్నా మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులు కనీసం పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. తక్షణమే సంబంధిత అధికారులు, మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ గారు స్పందించి, లీకేజీని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.