ఇందిరమ్మ ఇండ్లకు ... దీపావళి వెలుగులు
ఎర్రుపాలెం,(విజయక్రాంతి): దశాబ్ద కాలంగా ఎదురు చూసిన పేదోడి గూడికి ఆపన్న' హస్తం' అందించి ఆ కుటుంబంలో దీపావళి వెలుగులు నింపింది ప్రజా ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పేదవాడి కలను సాకారం చేస్తూ గూడు లేని ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేస్తూ పేదవాడి కుటుంబంలో వెలుగులు నింపాలనదే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేయటానికి నిర్ణయించింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Mallu Bhatti Vikramarka) ఆధ్వర్యంలో అర్హత కలిగిన ప్రతి పేదవానికి ఉండేందుకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది. మధిర నియోజకవర్గంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ళ ప్రవేశానికి ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టునున్నారు.
మండలంలో కూడా ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Homes)ను నిర్మించిన వారి కుటుంబంలో దీపావళి వెలుగులు నింపి ఆ కుటుంబాలతో ఆనందాన్ని పంచుకోవాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించి దీపావళి రోజున వేడుకలను చేయాలని సంకల్పించింది. మండలంలో ప్రతి గ్రామంలో ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అర్హత కలిగిన ప్రతి పేదవాడి కుటుంబానికి ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేసి ఇల్లు నిర్మించుకునేందుకు ప్రతి పేదవాని ఇంటికి 5 లక్షల రూపాయలను ఐదు దఫాలుగా ఇంటిని నిర్మించుకునేందుకు బ్యాంకులో జమ చేసి ఇంటిని అన్ని విధాలుగా సహకరించింది.
ప్రతి పేదవాడు తన ఇంటి నిర్మించుకునేందుకు ఉచితంగా ఇసుకను అందిస్తూ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మొదటి దశలో మండలంలో 31 గ్రామాలలో మొత్తం 675 ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేసింది. ఇందులో 556 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేశారు. మిగిలిన ఇందిరమ్మ ఇండ్లు 119 వివిధ నిర్మాణ దశలో ఉన్నాయి. మొదటి దశలో ఇందిరమ్మ నిర్మించిన ఇండ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుమేరకు మండలంలోని వివిధ గ్రామాలలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ప్రజాప్రతినిధులు, సర్పంచులు పాల్గొని దీపావళి పండుగ రోజు మండలంలో ఉన్న 31 గ్రామాలలో ఇళ్లను పూర్తిచేసిన ఇండల్లోకి మా ఇందిరమ్మ ఇంటిలో దీపావళి వెలుగులు ఘనంగా నిర్వహించి దీపావళి వేడుకల్లో పాల్గొని బాణసంచా కాల్చి ఆ ఇళ్లల్లో దీపావళి వెలుగుల నింపాలని సంకల్పించి కార్యక్రమంలో పాల్గొనాలని పేర్కొంది. మండలంలోని ప్రతి గ్రామంలో అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి వారి కుటుంబాలలో వెలుగులు నింపాలని ప్రజా ప్రభుత్వాన్ని మండల ప్రజల కోరుతున్నారు.