వధువు సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
కరీంనగర్ సిటీ,(విజయక్రాంతి): విత్ యూ ఫీడ్ దెమ్, క్రిస్టోఫర్ ఫౌండేషన్(Christopher Foundation) సహకారంతో వధువు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 10 వ తేదీ సోమవారం నాడు ఉచిత వైద్య శిబిరం(Free Medical Camp) నిర్వహిస్తున్నట్లు బిషప్ ప్రదీప్ కుమార్, వారి కుటుంబం సభ్యులు తెలిపారు. నగరంలోని విద్యారణ్యపురి రోడ్ నెంబర్: 1 లో ఉన్న వధువు సంఘం చర్చి ప్రాంగణంలో నవంబర్ 10 వ తేదీ ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ వైద్య శిబిరంలో సాధారణ వైద్య పరీక్షలతో పాటు కంటి వైద్య పరీక్ష, రక్తపోటు పరీక్ష (బీపీ), ఈసిజీ పరీక్ష, మధుమేహం పరీక్ష, రక్త పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వైద్య పరీక్షల అనంతరం అవసరమైన మందులు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. ఈ వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.వైద్య శిబిరం సమాచారం కోసం 9676864535, 9885500032 లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.