జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి
నిర్మల్,(విజయక్రాంతి): గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం, స్వాభిమానం కోసం తన జీవితాన్ని అంకితం చేసి పోరాడిన మహా విప్లవ వీరుడు భగవాన్ బీర్సా ముండా జయంతి(Birth Anniversary of Bhagwan Birsa Munda) వేడుకలను ఘనంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు పండిట్ అన్నారు. శనివారం ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో భగవాన్ బీర్సా ముండా జయంతి వేడుకల నిర్వహణపై జిల్లా కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న రావుల రాంనాథ్, పండిట్ జాదవ్ అన్నారు
సబ్ కా సాత్ – సబ్ కా వికాస్ – సబ్ కా విశ్వాస్ నినాదంతో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ, గిరిజనుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు హైదరాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గిరిజన సమాజం పెద్ద సంఖ్యలో పాల్గొని భగవాన్ బీర్సా ముండా ఆశయాలను, పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఈ జిల్లా కార్యశాలలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్ల రవీందర్ రెడ్డి, ఎస్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శులు ఇస్లావత్ మోహన్ నాయక్, సూరజ్ నాయక్, ఉపాధ్యక్షులు సంతోష్ నాయక్, కార్యదర్శులు కిషోర్, ప్రకాష్ నాయక్, గురు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.