చోరీ కేసు ఛేదనలో ప్రతిభ.. కానిస్టేబుళ్లకు రివార్డులు
07-11-2026 | 07:04pm
గణపురం,(విజయక్రాంతి): వెంకటేశ్వర్లపల్లి చోరీ కేసును వేగంగా ఛేదించడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కానిస్టేబుళ్లు శ్రీనివాస్, రమేశ్‌లను సీఐ కరుణాకర్ రావు, ఎస్ఐ బొరగల అశోక్ లు శనివారం అభినందించారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించి నిందితులను గుర్తించడంలో ప్రత్యేక చొరవ చూపిన పోలీసు సిబ్బందికి నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా సీఐ కరుణాకర్ రావు మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచే పోలీసు సిబ్బందిని ప్రోత్సహించడం ద్వారా మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేలా ఉత్సాహం కలుగుతుందని అన్నారు. కేసును తక్కువ సమయంలో ఛేదించడంలో కృషి చేసిన శ్రీనివాస్, రమేశ్‌లను అభినందించారు.