ఐసా తెలంగాణ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్‌గా బుర్ర స్వాతి
03-11-2026 | 05:06pm
భూపాలపల్లి టౌన్, నవంబర్ 03 (విజయక్రాంతి): ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) తెలంగాణ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్‌గా బుర్ర స్వాతి(Burra Swathi) ఎన్నికయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో నిర్వహించిన రాష్ట్ర వర్క్‌షాప్‌లో 21 మందితో నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. తనకు ఈ బాధ్యత అప్పగించిన ఐసా జాతీయ కమిటీ సభ్యులు వేమనకు స్వాతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థినుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతానని పేర్కొన్నారు. విద్య, వైద్యం, సమానత్వం, సామాజిక న్యాయం కోసం విద్యార్థినులను ఐక్యం చేస్తూ కృషి చేస్తానన్నారు.