విద్యార్థులకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్
జన విజ్ఞాన వేదిక చెకుముకి సైన్స్ సంబరాలలో భాగముగా నిర్వహణ
భూపాలపల్లి టౌన్, నవంబర్ 21 ( విజయ క్రాంతి ) : భూపాలపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో(Bhupalapally Tribal Welfare Ashram School) మండల పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్(Chekumuki Science Talent Test) నిర్వహించగా జిల్లా గౌరవ అధ్యక్షులు బి సేవా నాయక్, జిల్లా కోశాధికారి బి కుమార్ టాలెంట్ టెస్ట్ మండల కన్వీనర్ ఎం సురేష్, ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిసమ్మయ్య, గైడ్ టీచర్స్ శ్రీహరి విద్యార్థుల సమక్షంలో సైన్స్ సంబరాల టెస్ట్ ప్రశ్న పత్రమును ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులలో సైన్స్ పట్ల అభిరుచి పెంచడం కోసం ప్రతి సంవత్సరం బాలల సైన్స్ సంబరాల పేరున రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోటీలలో భాగంగా మండల స్థాయిలో వివిధ పాఠశాలల నుండి విచ్చేసిన విద్యార్థులకు పోటీ పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఈ పరీక్షలో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో జడ్పీహెచ్ఎస్ జంగేడు పాఠశాల విద్యార్థులు, గురుకుల విభాగంలో ఏహెచ్ఎస్ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు, ప్రైవేట్ విభాగంలో బిట్స్ పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. మొదటి స్థానం సాధించిన విద్యార్థులు ఈనెల 28న జరుగబోయే జిల్లా స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీలకు వీరు హాజరుకావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేవీవి సభ్యులు జూపాక మల్లేశం ఉపాధ్యాయులు హనీఫ్, లక్షణ్, భార్గవి, తిరుమల దేవి పాల్గొన్నారు.