బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన

27-11-2026 | 10:16pm

భూపాలపల్లి టౌన్, నవంబర్ 27 ( విజయ క్రాంతి ) : అంతర్జాతీయ బాల్య(International Childhood), ముందస్తు, బలవంతపు వివాహాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(PM SHRI Zilla Parishad High School) గొల్లబుద్దారంలో శుక్రవారం బాలికలకు బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం రవీందర్ రెడ్డి, మండల విద్యాధికారి దేవ, మహిళా ఉపాధ్యాయినులు బాలికలకు బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలు, బాల్యవివాహాల వలన విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై పడే ప్రతికూల ప్రభావాలు, బాలికల హక్కులు, విద్య యొక్క ప్రాముఖ్యత తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

మరిన్ని వార్తలు