విద్యార్థుల సామర్థ్యాల పెంపు పై ప్రత్యేక దృష్టి సారించాలి

27-11-2026 | 11:15pm

రోజూ గంట రెమిడియల్ క్లాస్ తప్పనిసరి - కలెక్టర్

వెనుకబడిన 31 స్కూళ్లపై ప్రత్యేక దృష్టి

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్.

సూర్యాపేట, నవంబర్ 27 (విజయక్రాంతి): విద్యార్థుల(Students') సామర్ధ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రభుత్వ స్కూళ్లలో(Government schools) పిల్లల చదువు మెరుగుపడాలంటే రోజూ గంటపాటు రెమిడియల్ తరగతులు(Remedial classes) తప్పనిసరిగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్(District Collector Tejas Nandlal Pawar) ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్ఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు, ఇంగ్లీష్, గణితంలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఎస్ఎస్సీ సమ్మేటివ్-1లో వెనుకబడిన 31 పాఠశాలల్లో సబ్జెక్టు నిపుణులతో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ఎఫ్ఎల్ఎన్ పాఠశాలల సందర్శనలో నిర్లక్ష్యం చేసిన వారికి వార్నింగ్ ఇచ్చారు. మంచి పనితీరు కనబరిచిన కందిబండ ప్రాథమిక పాఠశాలను అభినందించారు.

హాజరు 90 శాతం దాటాలని, ప్రీ ప్రైమరీ నమోదు పెంచాలని, అపార్ ఐడీలు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పీఎం శ్రీ, సమగ్ర శిక్ష నిధులు సక్రమంగా వాడాలని, స్కూళ్లలో డ్రగ్ ఫ్రీ వాతావరణం కల్పించాలని, మధ్యాహ్న భోజనంపై వారానికోసారి సమీక్ష చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఇంచార్జ్ డిఈఓ యర్రంశెట్టి రాంబాబు, జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు వై. రాంబాబు, శ్రవణ్, ఈ. హరికృష్ణ, టీ. పూలన్, సూర్యనారాయణ, సూపరింటెండెంట్ మోహన్, ఎఫ్ఎల్ఎన్ సెల్ సభ్యులు, ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, డీఈఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


.

మరిన్ని వార్తలు