ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
కలెక్టర్ రాహుల్ శర్మ
కారుణ్య నియామకాల కింద ముగ్గురికి ఉద్యోగాలు
భూపాలపల్లి, నవంబర్ 27 (విజయక్రాంతి): ప్రభుత్వ విధుల నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma) నూతన ఉద్యోగులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కారుణ్య నియామకాల(Compassionate appointments) కింద ఎంపికైన ముగ్గురికి జూనియర్ అసిస్టెంట్లుగా( Junior Assistants) నియామక ఉత్తర్వులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రవల్లికకు భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో(Bhupalpally Government General Hospital), కమల్‌కు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో, సోఫియాకు ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయంలో పోస్టింగ్‌లు కేటాయించినట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.