బియ్యం ధరల పట్టిక తప్పనిసరిగా ప్రదర్శించాలి

03-11-2026 | 04:57pm

జిల్లా పౌర సరఫరాల అధికారి కిరణ్

భూపాలపల్లి, నవంబర్ 03 (విజయక్రాంతి): జిల్లాలోని బియ్యం వ్యాపారులు, కిరాణా దుకాణాల యజమానులు వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా బియ్యం ధరల పట్టికలను తప్పనిసరిగా ప్రదర్శించాలని జిల్లా పౌర సరఫరాల అధికారి కిరణ్(Civil Supplies Officer Kiran) ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీలో బియ్యం వ్యాపారులు, కిరాణా అసోసియేషన్ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలని, అధిక ధరలు వసూలు చేసినా, ధరల పట్టిక ప్రదర్శించకపోయినా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నిర్ణయించిన గరిష్ట ధరలు: బీపీటీ, కేఎన్‌ఎం కిలో రూ.66, ఆర్‌ఎన్‌ఆర్, తెలంగాణ సోనా కిలో,రూ.74, హెచ్‌ఎంటీ,జేఎస్‌ఆర్ కిలో రూ.79గా తెలిపారు. ఈ ధరల పట్టికలను ప్రతి దుకాణంలో వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల సంస్థ డీఎం రాములు, తూనికలు కొలతల అధికారి శ్రీలత, సివిల్ సప్లైస్ అధికారులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, కిరాణా అసోసియేషన్ అధ్యక్షుడు, రైస్ ట్రేడర్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు