రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైన రిషిత
03-11-2026 | 06:12pm
మానకొండూరు, నవంబర్ 3 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పోచంపల్లి మోడల్ స్కూల్ విద్యార్థి జె .రిషిత రాష్ట్రస్థాయిలో సాఫ్ట్ బాల్(State Level Softball) క్రీడల్లో ఎంపికయింది. ఇటీవల తిమ్మాపూర్ మండలంలో శ్రీ చైతన్య ఇంజనీర్ కాలేజీలో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి ఎస్ జిఎఫ్ క్రీడలో అండర్ 19 మహిళ విభాగంలో సాఫ్ట్ బాల్ పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికైన జే .రిషితను స్కూల్ ప్రిన్సిపాల్ పద్మశ్రీ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుమన్, ఫిజికల్ డైరెక్టర్ విష్ణువర్ధన్, ఉపాధ్యాయులు, తదితరులు విద్యార్థులను అభినందించారు.