వ్యవసాయ ట్రాక్టర్లతో వాణిజ్య రవాణా.. మూడు ట్రాక్టర్లు సీజ్

03-11-2026 | 04:56pm

గణపురం,నవంబర్ 03 (విజయ క్రాంతి): వ్యవసాయ అవసరాల(Agricultural requirements) కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ట్రాక్టర్లను వాణిజ్య రవాణాకు వినియోగిస్తున్న వారిపై రవాణాశాఖ అధికారులు(Transport Department officials) చర్యలు చేపట్టారు. భూపాలపల్లి పట్టణంలోని మంజూరు నగర్, బాంబులగడ్డ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు మట్టి రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లను గుర్తించి సీజ్‌ చేసి కేసులు నమోదు చేశారు.

వ్యవసాయ ట్రాక్టర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించడం నిబంధనలకు విరుద్ధమని జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై తనిఖీలు కొనసాగించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తనిఖీల్లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు ఫహిమ సుల్తానా, శ్రీనివాస్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు