డాక్టర్ దంపతులకు సర్పంచ్ దంపతుల ఘన సన్మానం
గణపురం, అక్టోబర్ 21 (విజయక్రాంతి): ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో(Kotagulla) మంగళవారం సంగారెడ్డి జిల్లా(Sangareddy District) వైద్యాధికారిని డాక్టర్ లలితా దేవి రాజేశ్వరప్రసాద్(Lalitha Devi Rajeshwaraprasad) దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు జగిత్యాల వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కోడూరు నవీన్ కుమార్ సుమతి దంపతులు హైదరాబాద్ శ్రీ నందకా ఆస్పత్రి నిర్వహకులు డాక్టర్ కోడూరు ప్రవీణ్ కుమార్ దీపా రేఖ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించిన సందర్భంగా గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ దంపతులు డిఎంహెచ్ ఓ లలితా దేవి కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వైద్య పరంగా గణపురం గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని వారిని విజ్ఞప్తి చేశారు.