అగ్ని ప్రమాద బాధితులకు మాజీ ఎమ్మెల్యే ఆర్ధిక సహాయం

10-11-2026 | 06:09pm

ప్రభుత్వం ఆదుకోవాలని వినతి

భూపాలపల్లి టౌన్, నవంబర్ 10 ( విజయక్రాంతి ) : భూపాలపల్లి పట్టణంలోని(Bhupalpally town) గణేశ్‌ చౌక్‌లో ఫారెస్ట్‌ కార్యాలయం(Forest Office) ఎదుట పూల వ్యాపారం చేసుకుంటున్న నాలుగు దుకాణాలు దీపావళి రోజు రాత్రి అగ్ని ప్రమాదంలో(Fire accident) దగ్ధమైన విషయం తెలిసిందే. సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(Gandra Venkataramana Reddy) మంగళవారం బాధితులను పరామర్శించి, కాలిపోయిన షెడ్లను పరిశీలించారు.

బాధితులను ప్రభుత్వం తరఫున ఆదుకునేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో పాటు తహసీల్దార్ కు ఫోన్‌ చేసి, నష్టపోయిన వ్యాపారులకు త్వరగా సహాయం అందించాలని కోరారు. అనంతరం బాధితులు పర్ధం చంద్రకళ భూమయ్య, ఇర్ణాల జానీ, ఇర్ణాల లక్ష్మి, మల్లికార్జున్ లకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గండ్ర రూ.5000 ల చొప్పున ఆర్ధిక సహాయం(Financial Assistance) అందజేసి భవిష్యత్తులో అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

మరిన్ని వార్తలు