గుంటను వెంటనే పూడ్చించిన పోలీసులు!

10-11-2026 | 06:33pm

వాహనదారుల ఇబ్బందులపై ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ తక్షణ స్పందన

గరిడేపల్లి, నవంబర్ 10 (విజయక్రాంతి): మండలంలోని పొనుగోడు గ్రామ శివారులో ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంటతో వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై గరిడేపల్లి ఎస్ఐ బి. శ్రీకాంత్ గౌడ్(SI Srikanth Goud) వెంటనే స్పందించారు. రహదారిపై ఏర్పడిన గుంటను స్వయంగా పరిశీలించి, పోలీస్ సిబ్బంది సహకారంతో కంకర, మట్టిని వేయించి పూడ్చివేయించారు.

దీంతో వాహనదారులకు ప్రమాదం తప్పడంతో పాటు రాకపోకలకు ఆటంకం తొలగింది.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను గుర్తించిన వెంటనే స్పందించి పరిష్కరించిన ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్‌తో పాటు పోలీస్ సిబ్బందిని వాహనదారులు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీసులు చూపిన చొరవపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు