కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులపై ధర్మకర్తల పరిశీలన

10-11-2026 | 06:34pm

వేగంగా కొనసాగుతున్న నూతన ఆలయ నిర్మాణ పనులు

 పనుల పురోగతిపై ఆరా.. అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు

భూపాలపల్లి మహాదేవపూర్ నవంబర్ 10 విజయక్రాంతి : కాళేశ్వరం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం(Kaleshwaram) శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ(Sri Kaleswara Mukteeswara Swamy Temple) పునర్నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆలయ ధర్మకర్తలు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు సత్యనారాయణ, సీతయ్య, దొడ్ల అశోక్, కుంభం పద్మ, మంచినీళ్ల దుర్గయ్య నూతన ఆలయ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. వివిధ విభాగాల్లో జరుగుతున్న పనులను పరిశీలిస్తూ నిర్మాణానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.

ఆలయ పునర్నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని ధర్మకర్తలు పేర్కొన్నారు. పనుల నాణ్యత, భవిష్యత్తులో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని పలు సూచనలు, సలహాలు అందించారు. ఆలయ ప్రాశస్త్యానికి అనుగుణంగా నిర్మాణ పనులు నాణ్యతాప్రమాణాలతో కొనసాగించాలని సూచించారు. కాళేశ్వరం క్షేత్రానికి వచ్చే భక్తులకు(devotee) మరింత మెరుగైన ఆధ్యాత్మిక వాతావరణం, సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వారు తెలిపారు.

మరిన్ని వార్తలు