ఏసీటీఓగా ఎంపికైన సింగరేణి ఉద్యోగి కుమారుడు

10-11-2026 | 06:42pm

సత్కరించిన శ్రీరాంపూర్ జీఎం 

నస్పూర్, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా(Mancherial District) శ్రీరాంపూర్ S&PC విభాగంలో గార్డుగా విధులు నిర్వహిస్తున్న భానేష్ కుమారుడు క్రాంతి కుమార్ గ్రూప్ 2లో విజయం సాధించి ఏ.సి.టి.ఓ (A.C.T.O) గా  ఎంపికై జగిత్యాలలో విధులు నిర్వహిస్తున్నారు . సింగరేణి వారసునిగా ఉన్నత పదవిని అధిరోహించిన క్రాంతి కుమార్ ను శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ మంగళ వారం శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. 

శ్రీరాంపూర్ ఏరియా S&PC గార్డ్ భానేష్ కుమారుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే గ్రూప్-2లో విజయం సాధించి ఏసిటీవోగా ఎంపిక అవ్వడం ఎంతో అభినందనీయమన్నారు. సింగరేణి ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వరంగంలో ఉన్నత ఉద్యోగాలు సాధించడం సంస్థకు ఎంతో గర్వకారణం అన్నారు. సింగరేణి సంస్థ ఉద్యోగులకు ఉద్యోగ పరంగా,  సంక్షేమ పరంగా కల్పిస్తున్న మంచి వసతుల వల్లనే ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ఉన్నతంగా రాణించగలుగుతున్నారన్నారు.

తమ కుమారుడు ఈ విజయం సాధించటంలో సింగరేణి సంస్థ పాత్ర మరువలేనిది అన్నారు భానేష్ గారు. సింగరేణిలో తను ఉద్యోగిగా ఉన్నందు వల్లనే తన పిల్లలను ఉన్నత చదువులు చదివించటమే కాదు వారు ఉన్నత  లక్ష్యాలను ఎంచుకొని వాటిని అదిరోహించేందుకు అవసరమైన ఆర్థిక వెసులుబాటు తనకు కలిగింది అన్నారు . ఈ కార్యక్రమంలో ఏరియా సెక్యురిటీ ఆఫీసర్ హనుమాన్ గౌడ్, ఎస్ అండ్ పీసీ జూనియర్ ఇన్ స్పెక్టర్ రాజయ్య, జమేదార్ రాంచందర్, సీనియర్ సెక్యురిటీ గార్డు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు