కోట మైసమ్మ ఆలయం రహదారికి సీఎస్ఆర్ నిధులు మంజూరు
డబల్ రోడ్, సెంట్రల్ లైటింగ్ తో కొత్త అందాలు
వైరా ఎమ్మెల్యే చొరవ తో సింగరేణి నిధులు
సింగరేణి నవంబర్ 10 (విజయక్రాంతి): సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ తల్లి ఆలయం వరకు గల ప్రధాన రహదారి కొత్త అందాల సంతరించుకోనుంది. వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాసు నాయక్ ప్రత్యేక చొరవతో సింగరేణి కాలరీస్ కంపెనీ(Singareni Collieries Company) సీఎస్ఆర్ నిధులు రూ.3కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో కారేపల్లి - ఇల్లందు ప్రధాన రహదారి నుండి కోట మైసమ్మ తల్లి ఆలయం వరకు డబల్ రోడ్డు బిటి, సెంట్రల్ లైటింగ్ సిస్టంతో నిర్మించనున్నారు.
దీనికి సంబంధించి మంగళవారం పంచాయతీరాజ్ శాఖ ఈఈ మహేష్ బాబు, డీఈ కరుణాకర్ రెడ్డి, మండల ఏఈ రాజశేఖర్ లు ప్రతిపాదిత రోడ్డును పరిశీలించారు. రోడ్డుకు కొలతలు వేసి హద్దులు నిర్ణయించినారు.
ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త డాక్టర్ పర్సా పట్టాభి రామారావు, ఆలయ ఈవో కె వెంకటయ్య, పగడాల మోహన్ కృష్ణ, పర్సా సాయి లలిత్ అర్చకులు శ్రీ కొత్తలంక కైలాష్ శర్మ , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోటకూరి రాంబాబు, ఉసిరికాయలపల్లి, భాగ్యనగర్ తండా, పోలంపల్లి, సీతారాంపురం సర్పంచ్ లు వరలక్ష్మి రాజు, బానోత్ హీరోలాల్, హేమలత బాలాజీ, మూడు కిషోర్, గ్రామస్థులు పాల్గొన్నారు. కోట మైసమ్మ ఆలయ రోడ్డు నిర్మాణానికి సింగరేణి సంస్థ ద్వారా సిఎస్ఆర్ నిధులు మంజూరుకు కృషి చేసిన వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాసు నాయక్ కు ఆలయ ధర్మకర్త డాక్టర్ పర్సా పట్టాభి రామారావు, కే.వెంకటయ్య లు కృతజ్ఞతలు తెలిపారు.