ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలి

10-11-2026 | 06:32pm

ములకలపల్లి, నవంబర్ 10 (విజయక్రాంతి): సాయుధ పోరాట నాయకుడు చండ్ర పుల్లారెడ్డి ఆశయ సాధన కోసం ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఎస్.కె ఉమర్(New Democracy leader S.K. Umar) పిలుపునిచ్చారు. ములకలపల్లి మండలంలోని ముత్యాలంపాడు గ్రామంలో ఇంటిక లక్ష్మీ అధ్యక్షతన మంగళవారం అమరవీరుల సంస్మరణ సభను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కొత్తగూడెం జిల్లా నాయకులు ఎస్.కె ఉమర్ మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం చండ్రపుల్లారెడ్డి నాయకత్వంలో అడవి ఉద్యమాలు నడిచాయని లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచి పెట్టారని గుర్తుచేశారు.

ఆనాడు అన్నల నాయకత్వంలో వందలాది ఎకరాల పోడు భూములను బంజర భూములను భూస్వాముల భూములను ప్రజలకు పంచిపెట్టిన చరిత్ర పార్టీకి ఉన్నదని ఆదివాసీల హక్కుల కోసం ఆదివాసీల చట్టాల రక్షణ కోసం పోరాడింది ఎర్రజెండానేనని ఎర్రజెండా నాయకత్వంలో వందలాది మంది అన్నలు ప్రజల పక్షాన నిలబడి వారి నిండు ప్రాణాలు బలిగా అర్పించారని ఈ ప్రాంతంలో చలమన్న, కుంజ లక్ష్మణరావు ఇంకా ఎందరో ఈ ప్రాంత ఉద్యమంలో పనిచేసి అమరులయ్యారని చెప్పారు.

నాయకులు పొట్ల రామ నరసయ్య,నీలం రామచంద్రయ్య శ్రీపాద శ్రీహరి,కాచనపల్లి అమరవీరులు లింగన్న,ఎల్లన్న, ముసిమి, బత్తుల వెంకటేశ్వరరావు ఎందరో విప్లవకారులు ప్రజల పక్షాన నిలబడి కలబడి పోరాడి వారి నిండు ప్రాణాలను బలిదానం చేశారన్నారు.వారి ఆశయ సాధన కోసం ఆదివాసి గిరిజనులు ప్రజలు పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాల్లో పాల్గొనాలని కోరారు.ఈ కార్యక్రమంలో సంటి వెంకన్న,సీతారాములు,లక్ష్మి, నాగమణి,రాములమ్మ,సరోజన రాణి,రమణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు