సింగరేణిలో పారిశ్రామిక వివాదాల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్
భూపాలపల్లి టౌన్, నవంబర్ 10 ( విజయక్రాంతి ) : సింగరేణి సంస్థలో(Singareni Company) కార్మికులు, ఉద్యోగులకు(Workers and employees) సంబంధించిన పెండింగ్ పారిశ్రామిక వివాదాలను(Pending industrial disputes) సత్వరమే పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు సింగరేణి భూపాలపల్లి ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం జీఎం కార్యాలయంలో సింగరేణి సీనియర్ లా ఆఫీసర్, కన్వీనర్ అఫ్రిన్ సుల్తానా ఆధ్వర్యంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఏరియాకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ కమ్ లేబర్ కోర్టులో పెండింగులో ఉన్న పారిశ్రామిక వివాదాల కేసులను(Industrial Disputes Case) సమగ్రంగా సమీక్షించారు. ఆయా కేసులకు సంబంధించిన వివరాలు, పరిష్కారానికి ఉన్న అవకాశాలు, అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించారు.
పెండింగ్ కేసులను ప్రధానంగా మూడు విభాగాలుగా వర్గీకరించి ఈనెల 16వ తేదీ నుంచి 27వ తేదీ వరకు హైదరాబాదులోని సీజీఐటీ కమ్ లేబర్ కోర్టు ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో ప్రతి కేసుకు సంబంధించి పరిష్కార మార్గాలను సూచిస్తూ నిర్దిష్ట సిఫార్సులతో కూడిన నివేదికను రూపొందించారు. ఈ సమావేశంలో సీనియర్ పర్సనల్ ఆఫీసర్ మర్రి సాయి కృష్ణ, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ నితిన్ తదితరులు పాల్గొన్నారు.