అణగారిన వర్గాల సంక్షేమానికి జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు..

07-10-2026 | 07:02pm

భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 07 ( విజయక్రాంతి ) : పేదలు, ఆదివాసీలు, దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు మాజీ ఐఏఎస్ అధికారి ఎస్ ఆర్ శంకరన్(Former IAS officer S.R. Sankaran) అని ఆదివాసీ గిరిజన సంఘం వర్ధంతిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పోలం చిన్న రాజేందర్ అన్నారు.

జిల్లా కేంద్రంలో బుధవారం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శంకరన్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శంకరన్ ప్రభుత్వ అధికారిగా పనిచేసిన కాలంలో పేదలు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల సమస్యలను అర్థం చేసుకుని వారి హక్కుల పరిరక్షణ కోసం కృషి చేశారని అన్నారు.

ముఖ్యంగా ఆదివాసీల భూమి, విద్య, ఉపాధి, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన నిరాడంబర జీవితం, నిజాయితీ, ప్రజాసేవా దృక్పథం నేటి ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేకల మహేందర్, సీహెచ్ రవికుమార్, సునీత, కోట జ్ఞానేశ్వరి, మెతుకు స్రవంతి, గట్టు శంకర్ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు