జంగంపల్లి పీఏసీఎస్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం
జంగంపల్లి, అక్టోబర్ 7 (విజయ క్రాంతి): బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ పీఏసీఎస్(Jangampalli Village PACS) నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం బుధవారం నిర్వహించారు. చైర్మన్‌గా సావుసాని యాదవరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథిగా హాజరై పాలకవర్గాన్ని అభినందించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.
పీఏసీఎస్‌లు రైతులకు పంట రుణాలు, విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించాలని సూచించారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఇల్యాస్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి ,జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, భిక్కనూర్ మండల అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, రాజంపేట మండల అధ్యక్షుడు కృష్ణారావు,అధికారులు, పలు గ్రామల సర్పంచ్ లు,ఉప సర్పంచ్ లు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.