ఏఎస్ఐగా స్వప్నకు ప్రమోషన్..
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్ టౌన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఎస్ స్వప్న(Head Constable Swapna) ఏఎస్ఐ ప్రమోషన్ పొందారు. 2009 బ్యాచ్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ S. స్వప్న బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తూ, ASI గా పదోన్నతి పొందారు. పదోన్నతి ఆమె తాండూర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు.
ఈ సందర్భంగా బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో SHO K. శ్రీనివాసరావు తో పాటు సహా ఉద్యోగులు ఆమేకు ఘనంగా సన్మానం చేశారు. శాలువా, పూలమాలతో సత్కరించి, ఘనంగా వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో ఎస్ ఐ డి. రామకృష్ణ రావు, ఏ ఎస్ ఐ లు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.