ఎమ్మెల్సీ ఎన్నికల్లో సామ రామ్ మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలి

07-10-2026 | 07:52pm

వజ్రేష్ యాదవ్

మేడిపల్లి, అక్టోబర్ 7 (విజయక్రాంతి): హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సామ రామ్ మోహన్ రెడ్డి(Sama ram Mohan Reddy) బుధవారం మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని సామ రామ్ మోహన్ రెడ్డి కోరారు.

పట్టభద్రుల సమస్యలను శాసనమండలి వేదికగా ప్రస్తావించి, వారి హక్కులు మరియు ప్రయోజనాల కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. అనంతరం వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ, హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఐక్యంగా కదిలి సామ రామ్ మోహన్ రెడ్డికి మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహించాలని, పట్టభద్రుల ప్రతి ఓటు కీలకమని, కాంగ్రెస్ శ్రేణులు సమన్వయంతో పనిచేసి పట్టభద్రులను సామ రామ్ మోహన్ రెడ్డికి మద్దతు కోరాలని వజ్రేష్ యాదవ్ పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు