శివాలయంలో లక్ష కుంకుమార్చన వేడుకలు..
పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు...
సుల్తానాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్(Sultanabad) పట్టణంలోని శ్రీ శివాలయంలో శ్రీ లలితా సహస్రనామ పారాయణ సహిత లక్ష కుంకుమార్చన వేడుకలు ఎంతో వైభవంగా కన్నుల పండువగ జరిగాయి. ఈ సందర్భంగా శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, అర్చకులు వల్లకొండ మఠం రమేష్ లు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని ఒక సంవత్సరం పాటు తీసుకొని, ప్రతి నెల మొదటి మంగళవారం ప్రారంభించుకుని నేటికీ తొమ్మిది మాసములు పూర్తి చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పట్టణ ఆలయ భక్తుబృందం పాల్గొని పారాయణతో పాటు కుంకుమార్చన గావించారు. లోక కళ్యాణం కొరకు చేపట్టే ప్రతి కార్యక్రమం ఇందులో పాల్గొన్న ప్రతి మహిళలకు వారి యొక్క ఆరోగ్యం కుటుంబ సౌఖ్యం, కుటుంబ ఎదుగుదల ఉంటుందని వారు తెలిపారు. ఈ పారాయణ సహిత కుంకుమార్చన వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగుస్తుందని అన్నారు. మహిళలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా ఆలయ కమిటీ , పాలకవర్గ సభ్యులు అన్ని సౌకర్యాలు కల్పించారు, అందరికీ అల్పాహారం ఏర్పాట్లు చేశారు...